Thursday, May 29, 2025
Homeరాష్ట్రీయంఏం చేద్దాం?

ఏం చేద్దాం?

- Advertisement -

– కేటీఆర్‌కు తిరిగి నోటీసులు ఇవ్వటంపై : మీమాంసలో ఏసీబీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తిరిగి నోటీసులు ఇవ్వాలా.. వద్దా.. అనే మీమాంసలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలిసింది. బుధవారంనాడు ఈ కేసుకు సంబంధించి తమ ఎదుట హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వటం, అందుకు తాను అమెరికా వెళ్తున్నాననీ, కాబట్టి హాజరు కాలేకపోతున్నాను, తిరిగి వచ్చాక వస్తాను అంటూ కేటీఆర్‌ ఏసీబీకి సమాచారం ఇచ్చిన విషయం విదితమే. కేటీఆర్‌ మంగళవారం అమెరికాకు బయలుదేరి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు తిరిగి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలా లేక తాను అమెరికా నుంచి వచ్చాక హాజరవుతానంటూ సమాచారం ఇచ్చిన కారణంగా అప్పటి వరకు వేచి చూద్దామా అనే ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలిసింది. కేటీఆర్‌ జూన్‌ 5 లేదా 6న తిరిగి వస్తున్నందున అటు తర్వాతే ఆయనను విచారించే యోచన చేద్దామనే చర్చ కూడా అధికారుల మధ్య సాగినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -