Thursday, October 30, 2025
E-PAPER
Homeసినిమా'ఆర్యన్‌' రిలీజ్‌ ఎప్పుడంటే?

‘ఆర్యన్‌’ రిలీజ్‌ ఎప్పుడంటే?

- Advertisement -

విష్ణు విశాల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘ఆర్యన్‌’. ప్రవీణ్‌ కె దర్శకత్వంలో విష్ణు విశాల్‌ స్టూడియోజ్‌, శుభ్రా, ఆర్యన్‌ రమేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 31న విడుదల చేయాలని ముందుగా అనుకున్న ఈ సినిమా నవంబర్‌ 7కి వాయిదా పడింది. అయితే, తమిళ వెర్షన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 31నే విడుదల కానుంది. శ్రేష్ట్‌ మూవీస్‌ అధినేత సుధాకర్‌ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. వాయిదాకు గల కారణాలను స్పష్టం చేస్తూ విష్ణు విశాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘డియర్‌ తెలుగు ఆడియన్స్‌.. సినిమా అనేది రేస్‌ కాదు, అది ఒక వేడుకని నేను ఎప్పుడూ నమ్ముతాను.

ప్రతి వేడుకకీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, వెలుగు ఉండాలి. మా చిత్రం ‘ఆర్యన్‌’ అక్టోబర్‌ 31న తెలుగులోనూ విడుదల కావలసి ఉంది. ఈ ప్రత్యేక తేదీ మాస్‌ మహారాజా రవితేజ ‘మాస్‌ జాతర’, పవర్‌ఫుల్‌ ‘బాహుబలి ది ఎపిక్‌’ మీ అందరినీ అలరించడానికి రావడంతో మరింత ప్రత్యేకమైనది. నేను ఎప్పటినుంచో రవితేజని గాఢంగా ఆరాధిస్తాను. స్క్రీన్‌పైన ఆయన ఎనర్జీకి మాత్రమే కాకుండా, మాకు ఆయన మద్దతు (నా గట్టా కుస్తీ సినిమాకి ఆయన సహనిర్మాతగా ఉన్నారు) కూడా ఉంది. అలాగే, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి నేను లైఫ్‌ టైం ఫ్యాన్‌ని. ఈ వారం వారి సినిమాలని సెలబ్రేట్‌ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను. కాబట్టి, నవంబర్‌ 7న మా ‘ఆర్యన్‌’ తెెలుగులోకి వస్తుంది’ అని విష్ణు విశాల్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -