Friday, October 10, 2025
E-PAPER
Homeసినిమా'వృషభ' రిలీజ్‌ ఎప్పుడంటే?

‘వృషభ’ రిలీజ్‌ ఎప్పుడంటే?

- Advertisement -

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తాజాగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘వృషభ’. కన్నెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్‌, అభిషేక్‌ ఎస్‌వ్యాస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సి.కె. పద్మ కుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌ సింగ్‌, విశాల్‌ గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా నిర్మిస్తున్నారు. హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్‌ నుంచే ఎక్స్‌పెక్టేషన్స్‌ భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మలయాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌ సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమాకు నంద కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నవంబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఏక్తా కపూర్‌ మాట్లాడుతూ, ‘ఇది నా హదయానికి ఎంతో దగ్గరైన కథ. బలమైన భావోద్వేగాలు, లార్జర్‌ దేన్‌ లైఫ్‌ డ్రామాతో ఇండియన్‌ సినిమాను గొప్పగా ఆవిష్కరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమాతో ఓ చరిత్రను క్రియేట్‌ చేయబోతున్నాం. బలమైన భావోద్వేగాలతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను రూపొందించాం. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌కు గొప్పగా కనెక్ట్‌ అవుతుంది’ అని దర్శకుడు నంద కిషోర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -