నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవెన్’. సుందర్ సి వద్ద ‘కలకలప్పు 2’, ‘వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి’ చిత్రాల విజయం తర్వాత వీరు చేస్తున్న మూడవ వెంచర్ ఇది. ఈ చిత్రం ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఒక మ్యాసీవ్ ఫైర్ యాక్సిడెంట్‌తో మొదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ‘లాస్ట్ ఇయర్ వైజాగ్‌లో వరుసగా ఎనిమిది హత్యలు జరిగాయి. ‘సీరియల్ కిల్లింగ్స్’ అనే ఇంటెన్స్ డైలాగ్‌తో పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర ఆ కేసుని పరిశోధించిన తీరు, ‘సైకో కిల్లర్ విత్ అన్ బిలివబుల్ ఐక్యూ’అనే డైలాగ్ సైకో కిల్లర్ క్యారెక్టర్ చుట్టూ సస్పెన్‌ని మరింతగా పెంచింది. నవీన్ చంద్ర ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, సీరియల్ కిల్లింగ్ బ్యాగ్‌డ్రాప్, డైరెక్టర్ లోకేశ్ అజ్ల్స్ గ్రిప్పింగ్ టేకింగ్ ట్రైలర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి అని మేకర్స్ చెప్పారు. ‘సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్’లో నటించిన రేయా హరి ఇందులోనూ కథానాయికగా నటించింది. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని రుచిర ఎంటర్టైన్మెంట్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
8 హత్యలు చేసింది ఎవరు?
- Advertisement -
RELATED ARTICLES