ఈఆర్సీ చైర్మెన్‌ను ప్రశ్నించిన వినియోగదారులు
పాలకవర్గం వల్ల అవినీతి జరుగుతోందని ఆరోపణ
వార్షిక ఆదాయ ఆవశ్యకతపై బహిరంగ విచారణ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్‌లో 2026-27 సంవత్సరపు వార్షిక ఆదాయ ఆవశ్యకతపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) బృందం బహిరంగ విచారణ చేపట్టింది. సెస్ పరిధిలోని వినియోగదారులు తమ సమస్యలను ఈఆర్‌సీకి వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తెలంగాణ ఈఆర్‌సీ బుధవారం నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరైన తెలంగాణ ఈఆర్సీ చైర్మెన్ డాక్టర్ జస్టిస్ డి.నాగార్జున, కె.రఘు, ఈఆర్‌సీ టెక్నికల్ విభాగం సభ్యులు సీహెచ్ శ్రీనివాస్ రావుకు సెస్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయంలో జరిగిన బహిరంగ విచారణలో సెస్ సంస్థ వినియోగదారులకు ఎలాంటి సేవలందిస్తుందో సెస్ అధికారులు వివరించారు.
సంస్థ మనుగడకు తీసుకుంటున్న చర్యలను సభ్యుల ముందు క్లుప్తంగా వివరించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సెస్ సంస్థలో ట్రాన్స్‌కో విధానాలు అమలవుతున్నప్పుడు.. ఈ సంస్థను ట్రాన్స్‌కోలో ఎందుకు విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. పాలకవర్గం నిర్ణయాల వల్ల సంస్థ అనేక రాష్ట్రాల్లో ముందుకు సాగుతోందని, కానీ ఇక్కడ అలా లేదని, వెంటనే సెస్ సంస్థను ట్రాన్స్‌కోలో విలీనం చేయాలని పలువురు కోరారు. పాలకవర్గం ఉండటం వల్ల అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, వీటన్నిటినీ నియంత్రించి సంస్థను కాపాడాలంటే విలీనం ఏకైక మార్గమని అన్నారు.
సెస్‌ను ట్రాన్స్‌కోలో ఎందుకు విలీనం చేయడం లేదు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


