Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభార్య నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ భర్త వైస్‌ చైర్మెన్‌

భార్య నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ భర్త వైస్‌ చైర్మెన్‌

- Advertisement -

నవతెలంగాణ-నిర్మల్‌
నిర్మల్‌ మున్సిపాలిటీ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌తో పాటు అభ్యర్థుల ప్రమాణస్వీకారం సోమవారం జరిగింది. నిర్మల్‌ మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులు ఉండగా అందులో 24 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాగా చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌, పదవులు భార్యా భర్తలు దక్కించుకున్నారు. ఇందులో నిర్మల్‌ చరిత్రలో చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ పదవులు భార్యాభర్తలు తీసుకోవడం ఇది మొదటిసారి. చైర్మెన్‌గా అప్పాల కావ్య, ఒకటో వార్డు కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌ ఆమె పేరును ప్రతిపాదించగా ఈ మేరకు 23 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు చైర్మెన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు వైస్‌ చైర్మెన్‌ కోసం 28వ వార్డు కౌన్సిలర్‌ గోపీనాథ్‌.. వైస్‌ చైర్మెన్‌గా అప్పాల గణేష్‌ చక్రవర్తికి మద్దతు తెలుపగా ఇందులో 23 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా శశికళ ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా ఆమె భర్త రమేష్‌ ఎన్నికయ్యారు. భార్యాభర్తలే మున్సిపల్‌ పీఠాలను అధిష్టించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -