నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో శ్రీ హనుమాన్ మందిరం ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆలయ ఆవరణంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆలయ పరిపాలన సక్రమంగా నిర్వహించే విధంగా కమిటీ సభ్యులకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవం మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, యువ నాయకులు సాయి పటేల్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు సాయిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విట్టల్,ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్స్పెక్టర్ కమలబాయి, సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్, ఇతర అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



