నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో డిసిఎంఎస్ వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు కనుమరుగైయ్యేనా.? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు మండలంలో మొత్తం 11 కొనుగోలు కేంద్రాలు ఉండేవి.రానురాను తగ్గుతూ ప్రస్తుతం మల్లారం, దబ్బగట్టు, చిన్నతూoడ్ల గ్రామాల్లో మూడు కొనుగోలు కేంద్రాలు మాత్రమే గత రబీ సీజన్లో ఏర్పాటు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఆ మూడు కేంద్రాలు కూడా ఉంటాయా..ఉడుతాయా తెలియని పరిస్థితి నెలకొంది. తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మాత్రం గత రబీ సీజన్లో 11వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అవి 16 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాలు తగ్గుతూ..పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాలు పెరగడం చూస్తే రైతులకు పిఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు,ఇటీవల ఏర్పడిన యూరియా కొరతను సైతం పిఏసిఎస్ సొసైటీ ద్వారా తీర్చినట్లుగా రైతులు చెబుతున్నారు. డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తూకం పేరిట రైతులు ఇబ్బందులకు గురివుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలు కనుమరుగవుతూ.. పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాలు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలు కనుమరుగైయ్యేనా.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES