Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిజాలను వెల్లడిస్తే అరెస్టులా..? 

నిజాలను వెల్లడిస్తే అరెస్టులా..? 

- Advertisement -

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

ఈవీఎంల ట్యాంపరింగ్ పై బహిరంగంగా మాట్లాడి సాక్షాలతో నిజాలను బయటపెడితే అక్రమంగా అరెస్టులు చేస్తారని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈవీఎంల ట్యాపరింగ్ జరుగుతుందని ఆధారాలతో కూడిన ప్రశ్నలు లేవనెత్తినందుకే అక్రమంగా అరెస్టులు చేయడం బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతగల ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రతిపక్షాల గొంతును నొక్కుతుందని విమర్శించారు. అణచివేసే ధోరణికి కేంద్ర ప్రభుత్వం పాల్పడితే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలోని బిజెపి రహిత పార్టీలన్నీ ఐక్యమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని బిజెపి నిరంకుశ పాలనను అంతమొందించేందుకు ఏకం కావాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img