Monday, April 13, 2026
E-PAPER
Homeఆటలుపుంజుకుంటారా?

పుంజుకుంటారా?

- Advertisement -

రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ ఢీ నేడు

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఐపీఎల్‌19లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంచనాలను అందుకోవటం లేదు. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఆశించిన స్కోర్లు సాధించటం లేదు. బలహీన బౌలింగ్‌ లైనప్‌ 200 ప్లస్‌ స్కోర్లను కాపాడటంలో తేలిపోతుంది. సీజన్లో 4 మ్యాచ్‌ల్లో మూడింట పరాజయం పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పుంజుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌ ఫామ్‌లో ఉన్నారు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అనికెత్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ టచ్‌లో కనిపిస్తున్నారు. ప్రమాదకర బ్యాటర్‌గా పేరు గడించిన హెన్రిచ్‌ క్లాసెన్‌.. ఈ సీజన్‌లో భిన్నమైన బ్యాటింగ్‌ తీరు కనబరుస్తున్నాడు. బౌలర్లపై విరుచుకుపడే క్లాసెన్‌.. స్ట్రయిక్‌రొటేషన్‌, ఆఖరు వరకు క్రీజులో ఉండేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.

ఫలితంగా, క్లాసెన్‌ నిలిచినా సన్‌రైజర్స్‌ ఆఖరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయటం లేదు. ఈ బలహీనత సన్‌రైజర్స్‌ అధిగమించాలి. మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ ఆడిన 4 మ్యాచ్‌ల్లో అప్రతిహాత విజయాలు సాధించింది. ఆ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు బలంగా ఉన్నాయి. ఓటమెరుగని రాయల్స్‌ను నేడు సన్‌రైజర్స్‌ ఢీకొట్టనుంది. యువ బ్యాటర్లు వైభవ్‌ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాాజస్తాన్‌, హైదరాబాద్‌ మ్యాచ్‌ నేడు ఉప్పల్‌ స్టేడియంలో జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -