Saturday, January 10, 2026
E-PAPER
Homeజిల్లాలుఎన్నికల నేపథ్యంలో మూతపడ్డ వైన్సులు

ఎన్నికల నేపథ్యంలో మూతపడ్డ వైన్సులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మూడో విడుదల భాగంగా ఈనెల 17న మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. సోమవారం సాయంత్రం ఎక్సైజ్ అధికారులు మండలంలో ఉన్న నాలుగు వైన్స్ లను మూసివేసి సీల్ వేశారు. మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్ఐ మానస దగ్గరుండి తన సిబ్బందితో మద్యం దుకాణాలను మూయించి సీల్ వేయించారు. ఎన్నికల ముగిసిన అనంతరం 18న తిరిగి వైన్సులు చేర్చుకుంటాయని ఈ సందర్భంగా ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -