నవతెలంగాణ – కంఠేశ్వర్
మూడవరోజు తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళ కళాశాలలో సోమవారం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ –1, తెలుగు విభాగం సహకారంతో ప్రేరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రివర్స్ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత అయిన నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులకు ఉత్సాహభరితమైన సందేశాలు అందించారు. తన జీవన ప్రయాణం, కష్టపడి సాధించిన విజయాలను వివరిస్తూ, యువత లక్ష్య సాధనలో ముందుకు సాగాలని ప్రేరేపించారు.
ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు గ్రామ పంచాయతీ గోడలపై శుభ్రత కార్యక్రమం మరియు పెయింటింగ్ పనులు నిర్వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సైదా జైనబ్ మేడం, వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు, ఎన్ ఎస్ ఎస్ ఎం కోఆర్డినేటర్ వి.జి. లక్ష్మి పాల్గొని వాలంటీర్లను అభినందించారు. గ్రామ సర్పంచ్ పీరుబాయి వీర్ కుమార్, ఉప సర్పంచ్ అమ్రు , వార్డు సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు. కార్యక్రమ నిర్వహణలో సెక్రటరీ ప్రవీణ్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవా భావం మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు.



