నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ లో శుక్రవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటుచేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ బైకాన్ జమున మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జమున మహేష్ మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎండ వేడిమికి దాహంతో వచ్చే గ్రామస్తులకు చల్లటి త్రాగు నీటిని ప్రతిరోజు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. గ్రామం గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులు, గ్రామస్తులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు బందెల రాజు, రమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్ లో చలివేంద్రం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



