- Advertisement -
ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
నవతెలంగాణ-నారాయణఖేడ్ రూరల్
ఇద్దరు పిల్లలను చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేటలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ప్రమీల(22) కుటుంబంలో తగాదాల కారణంగా తన ఇద్దరు కుమారులు ధనుష్(3), సూర్యవంశీ(45 రోజులు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. నాలుగు రోజుల క్రితం సూర్యవంశీని ఊయలలో వేసే కార్యక్రమాన్ని పూర్తిచేసి ప్రమీలను భర్త సంగమేశ్వర్ ఆమె పుట్టింటికి పంపించినట్టు తెలుస్తోంది. కాగా, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -