Wednesday, December 3, 2025
E-PAPER
Homeకరీంనగర్బుజ్జగింపులతో విత్ డ్రాలు..

బుజ్జగింపులతో విత్ డ్రాలు..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ రూరల్
బొల్లారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బుధవారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలతో జరిగిన బుజ్జగింపుల దౌత్యం ఫలించి, సర్పంచ్ అభ్యర్థి మురుగం శ్రీలత అనిల్ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. పార్టీ ఐక్యతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రాంతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

విత్‌డ్రా అనంతరం శ్రీలత ,అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి ఇరువాలా లావణ్య మల్లేశం విజయం కోసం గ్రామంలోని కార్యకర్తలంతా ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. బొల్లారంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆమె కోరారు. ఈ పరిణామంలో మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఆదిల్ పాషా, ఈసంపల్లి పరుశురాం, బుర్ర నారాయణ, షేక్ జావిద్, సుద్దాల కైలాసం, గుర్రం చంద్రయ్య తదితర నాయకులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగిన ఈ విత్‌డ్రా, కాంగ్రెస్ బలాన్ని పెంచే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -