నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని రాజ రాజేశ్వరి నగర్ గ్రామంలో అనారోగ్యంతో మనస్థాపం చెంది ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోదాసు లక్ష్మ(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. వైద్యం కోసం ఎన్నో ఆస్పత్రులలో చూయించుకుంది. అయినప్పటికీ అనారోగ్యం కుదుటపడకపోవడంతో మనస్థాపం చెంది తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయమై మృతురాలి కుమారుడ బోదాసు గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవ పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -