Wednesday, April 1, 2026
E-PAPER
Homeక్రైమ్పాముకాటుకు గురై మహిళ మృతి

పాముకాటుకు గురై మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన గంగుల రాధమ్మ (50) అనే మహిళ పాటుకాటుకు గురై మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల, కొయ్యుర్ పోలీసులు పూర్తి కథనం ప్రకారం రాధమ్మ బుధవారం ఉదయం 5.30 లకు ఇంటి పనులు చేస్తున్న నేపథ్యంలో పాముకాటుకు గురైందని తెలిపారు. వెంటనే చికిత్స కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకెళ్లారు.

ఆస్పత్రి తలుపులు తెరిచి ఉన్న వైద్యశాలలో సిబ్బంది ఎవరు లేరని తెలిపారు. అంబులెన్స్ లో మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి రెపర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరైయ్యారు. తాడిచెర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలందిస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో అమలు కావడం లేదని, అలా అమలైతే రాధమ్మ ప్రథమ చికిత్స అందెదని పలువురు ఆరోపిస్తున్నారు. మృతురాలు కుమారుడు శ్రావణ్ ఫిర్యాదు మేరకు కొయ్యుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -