నవతెలంగాణ – భువనగిరి
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం మొగ్గుంపల్లికి చెందిన సిల్వేరు సత్యనారాయణ, మల్లమ్మ దంపతులు శనివారం ఉదయం మల్లమ్మను కూలీ పనికి వదిలేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి పట్టణంలోని జంఖన్నగూడెం చౌరస్తా వద్దకు రాగానే నల్లగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అగి ఉన్న బైక్‌ను ఓవర్ స్పీడ్‌గా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా సత్యనారాయణకు గాయాలయ్యాయి. కాగా దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె వివాహానంగా ఇద్దరు పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
