నవతెలంగాణ – డిచ్ పల్లి
మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అధిక కట్నం తీసుకురమ్మని చెప్పి రోజు చిత్రవధ చేస్తుండటంతో మనస్థాపం చెంది చెరువులో దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ జి సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్ పల్లి మండలం లోని కోరట్ పల్లి గ్రామానికి చెందిన నీరడీ హేమలత అలియాస్ సంధ్య (32)కు నల్లవెల్లి గ్రామానికి చెందిన నీరడి గంగాధర్ కు గత 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్ని ఏండ్ల తర్వాత నుంచి భర్త గంగాధర్, అత్త ఎల్లవ్వ ఇద్దరూ మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అధిక కట్నం తీసుకురమ్మని చెప్పి రోజు చిత్రవధ చేస్తుండేవారని, మృతురాలికి పిల్లలు లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించడానికి డబ్బులు ఇవ్వమని భర్త గంగాధర్ వేధించేవాడన్నారు.
దినికి గాను మృతురాలి తల్లిదండ్రులు రెండు మూడుసార్లు పెద్దల సమక్షంలో మాట్లాడి సర్ది చెప్పి ఇంటికి పంపించినా మృతురాలి భర్త గంగాధర్ తన ప్రవర్తన మార్చుకోకుండా శుక్రవారం సాయంత్రం మృతురాలిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. దీంతె మృతురాలు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో నుండి కాలకృత్యాలకు అని చెప్పి వెళ్లి గౌరారం శివారులో సాకివాగు లో దూకి ఆత్మహత్య చేసుకుందని ఎస్ హెచ్ ఓ జి సందీప్ వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చరికి తరలించినట్లు ఆయన తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
వరకట్న వేధింపులకు మహిళ బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES