- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ ఆకాంక్షించారు. సోమవారం కొయ్యూరు గ్రామంలో మహిళ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే పావలా వడ్డీ రుణాలు, మహాలక్ష్మీ పథకం, స్వశక్తి మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



