Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయూరియా కోసం ఇద్ద‌రు మ‌హిళ‌లు సిగాప‌ట్లు 

యూరియా కోసం ఇద్ద‌రు మ‌హిళ‌లు సిగాప‌ట్లు 

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబాబాద్‌లో యూరియా కోసం ఎదురుచూస్తున్న మహిళా రైతులు పరస్పరం గొడవ పడ్డారు. ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో చెలరేగిన వాగ్వివాదం వారి మధ్య ఘర్షణకు దారితీసింది. విపరీతమైన ఆవేశానికి గురైన మహిళలు క్యూలైన్లలో రైతులంతా చూస్తుండగానే జుట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. నెలరోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులు సహనం కోల్పోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -