Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతాగి కొడుతున్నారంటూ మహిళా సంఘాల నిరసన

తాగి కొడుతున్నారంటూ మహిళా సంఘాల నిరసన

- Advertisement -

– ఎక్సైజ్ అధికారులకు చెప్పిన పట్టించుకోని వైనం
– పురుగుల మందు తాగి చస్తామంటున్న మహిళా మణులు!
– మీరు చక్కగుంటే మీ భర్తలు చక్కగుంటారంటూ కించపరిచిన ఎక్సైజ్ ఆఫీసర్లు!
నవతెలంగాణ-అక్కన్నపేట

అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్లో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని సూచించారు. బెల్ట్ షాపు యజమానులు ఉద్దెర ఇవ్వడం వల్ల, మాకు వచ్చిన కూలి పంట డబ్బులు కూడా అటే వెళ్ళిపోతున్నాయని తెలియజేశారు. ఈ ఇష్యుపై ఎక్స్చేంజ్ అధికారులకు విన్నవిస్తే, కనీసం పట్టించుకోలేదని అన్నారు. మీరు చక్కగా ఉంటే మీ భర్తలు చక్కగా ఉంటారంటూ కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము రోజు కూలి చేసి మా పిల్లల్ని సాకుతున్నామని, భూములు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రం అందించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్ షాపులను తొలగించకపోతే గ్రామమంతా కదిలి, హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామం మహిళలు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -