- Advertisement -
నవతెలంగాణ- జన్నారం
జన్నారం మండలంలోని కలమడుగు శ్రీ నర నారాయణస్వామి ఆలయంలో శనివారం మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం స్వామివారి జాతర, సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు యాదగిరి స్వదేశీ రావు, సర్పంచ్ బొంతల నాగలక్ష్మి మల్లేష్, గ్రామస్తులు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



