రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లతో భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని తెలిపారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ తదితర జిల్లా కలెక్టర్లు మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం పేద ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులకు చేర్చవలసిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల అవసరాలను అర్థం చేసుకొని పని చేయాలని కలెక్టర్లకు మార్గ నిర్దేశం చేశారు. ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని అన్నారు. ప్రజలతో మమేకం కావాలని సూచించారు. భేషజాలకు పోకుండా క్షేత్ర స్థాయిలో సమస్యలను అవగాహన చేసుకుని పాలన సాగించాలన్నారు. ఎన్నో ఆశలతో కలెక్టరేట్లకొచ్చే పేదలకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



