Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకలిసి పని చేయండి

కలిసి పని చేయండి

- Advertisement -

– కొండా మురళికి కమిటీ చైర్మెన్‌ మల్లు రవి సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ఆయన వివరణ ఇచ్చినపప్పటికీ కమిటీ సంతృప్తి చెందలేదు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ సూచించింది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రెండోసారి కమిటీ ముందు హాజరయ్యారు. దాదాపు రెండుగంటలపాటు సమావేశం జరిగింది. అనంతరం ఆ కమిటీ చైర్మెన్‌ మల్లు రవి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలపై చర్చించినట్టు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అన్ని కార్యక్రమాల్లో కలిసి పని చేసేందుకు మురళి ఒప్పుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు అనిరుద్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలపై చర్చ జరగలేదని చెప్పారు. వారి విషయాలను తమ దృష్టికి రాలేదన్నారు. కొండా మురళి మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పని చేయాలంటూ చైర్మెన్‌ సూచనను పాటిస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలను తూ.చా తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img