Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

- Advertisement -
  • శుభాకాంక్షలు తెలిపిన బుసిరెడ్డి పాండన్న
    నవతెలంగాణ-పెద్దవూర

    నాగార్జున సాగర్ నియోజకవర్గం  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, నియోజకవర్గం ప్రజలకు అధికారులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్బంగా బుసిరెడ్డి పౌండష్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న శుభాకాంక్షలు తెలిపారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఆఫ్రికన్‌ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించిందని,అప్పటినుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను జరుపుకుంటున్నామని తెలిపారు. నిజాలను నిర్భయంగా రాయడం వారికే సాధ్యం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం లక్ష్యాలుగా ఉంటాయని వారి సేవలను కొనియాడారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -