Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

- Advertisement -

జెండా ఆవిష్కరణ చేసిన టిపిఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ఆకుల లల
నవతెలంగాణ – కాటారం

శనివారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సిద్నెపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఆదివాసీ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధికార ప్రతినిధి ఆకుల లలిత మాట్లాడుతూ సామ్రాజ్యవాదులకు బహుళ జాతి కంపనీలకు కార్పొరేట్ సంస్థలకు మధ్య భారతంలో అపారమైన ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అడవిలో ఉన్న ఆదివాసులను అంతం చేస్తూ హింస, నిర్బంధం కొనసాగిస్తున్నది. బస్తర్ ప్రాంతంతో 250 పోలీస్ క్యాంపులను ఏర్పాటుచేసి ఎనిమిది లక్షల పారా మిలటరీ పోలీసు బలగాలు నిత్యం  కూంబింగ్ లతో,  బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా ఆదివాసులను చంపి వేస్తున్నారు.

2005 లో సల్వాజుడుం, 2009 లో ఆపరేషన్ గ్రీన్ంట్, 2015 లో అపరేషన్ సమాధాన్, 2024 లో  అపరేషన్ కగార్ పేరుతో ఆరు నెలల పసిపాప మండ్లి సోడి నుంచి అరవై సంవత్సరాల వృద్ధుల వరకు చంపివేస్తున్నారు.  పదమూడు నెలల కాలంలోనే 600 ఆదివాసి ప్రజలను ప్రభుత్వం చంపివేసింది. -ఈ మానవ హింసను  నివారించుటకు ఆదివాసులు జీవించే హక్కుకోసం దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పౌరులు, మేధావులు,  ప్రజా తంత్ర దేశ భక్తులు అదివాసులకు మద్దతుగా నిలబడాలని లలిత విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రాజు, జైనీ పోసక్క,గుంటి మైథిలీ, బాలాజీ, కమల,  రమ, కోడీ గట్టమ్మ, పోలం లక్మి , స్వామీ, కోమురక్క, దయ్యం ఎర్రయ్య, వెంకటమ్మ, రాకేష్, రాజు, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img