Magazines

సుంకాల పోరుకు చైనా బ్రేక్‌

24 నిమిషాల క్రితం

Give me
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 2 నిమిషాల చదవడం

అమెరికాకు మరో రెండు నెలల ఊరట !
అమెరికా దిగుమతులపై అదనపు సుంకాల నిలిపివేతను పొడిగించిన చైనా

మరో రెండు నెలల పాటు 24 శాతం సుంకాల నుంచి ఊరట

వాషింగ్టన్‌: అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై గతంలో విధించిన అదనపు 24 శాతం సుంకాల అమలును నిలిపివేసే గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. అయితే ప్రాథమికంగా విధిస్తున్న 10 శాతం సుంకాన్ని మాత్రం కొన సాగించనున్నట్లు స్పష్టం చేసింది. చైనా తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చర్చనీ యాంశంగా మారింది.

ట్రంప్‌-జిన్‌పింగ్‌ చర్చల ప్రభావం

గత ఏడాది అక్టోబర్‌ చివరిలో దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య జరిగిన సమావేశం ఈ పరిణామానికి నేపథ్యంగా నిలిచింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం, సుంకాల వివా దాన్ని తగ్గించడం వంటి అంశా లపై అప్పట్లో అవగాహన కుది రింది. ఈ ఒప్పందంలో భాగంగా అదనపు సుంకాల నిలిపివేతకు చైనా గడువును తాజాగా మరోసారి పొడిగించింది.

10 శాతం సుంకం కొనసాగింపు

అమెరికా దిగుమతులపై అదనంగా విధించిన 24 శాతం సుంకాల నుంచి తాత్కాలికంగా మినహాయింపు కల్పించినప్పటికీ, 10 శాతం ప్రాథమిక సుంకాన్ని చైనా కొనసాగిస్తోంది.

దీంతో అమెరికా ఎగు మతిదారులకు కొంత మేర ఖర్చు భారం తప్పింది. అయినప్పటికీ అదనపు సుంకాల నిలిపివేతతో వాణిజ్య కార్య కలాపాలకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది.

ప్రపంచ మర్కెట్లపై ప్రభావం

అమెరికా, చైనా మధ్య సుంకాల వివాదం ప్రపంచ పారి శ్రామిక రంగంతో పాటు అంత ర్జాతీయ సరఫరా వ్యవస్థపైనా ప్రభావం చూపు తోంది. ఇరు దేశాలు పర స్పరం సుంకాల విష యంలో తాత్కాలిక వెసులు బాట్లు కల్పిస్తున్న ప్పటికీ, పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పం దం కుదిరే వరకు ప్రపంచ మార్కె ట్లలో అనిశ్చితి కొన సాగే అవకాశముంది. తాజా నిర్ణ యంతో తక్షణం వాణిజ్య ఉద్రి క్తతలు పెరగ కుండా కొంత ఉపశ మనం లభించి నప్పటికీ, ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్