Magazines

అభిశంసనను అనుమతిస్తా

22 నిమిషాల క్రితం

I will allow the impeachment.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

కాబోయే ప్రతినిధిసభ

స్పీకర్‌ హకీం జెఫ్రీన్‌

న్యూయార్క్‌ : రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ అభిశంసనకు తాను కచ్చితంగా అనుమతిస్తానని అమెరికా ప్రతినిధిసభ తదుపరి స్పీకర్‌గా ప్రచారంలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు, న్యూయార్క్‌ కాంగ్రెస్‌ సభ్యుడు హకీం జెఫ్రీన్‌ చెప్పారు. ఏబీసీ కార్యక్రమం 'దిస్‌ వీక్‌'లో ఆయన మాట్లాడుతూ హెగ్‌సేథ్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, దేశ భద్రతను దెబ్బతీశారని, ఇరాన్‌పై నిర్లక్ష్యపూరిత, ఖరీదైన యుద్ధాన్ని ఇష్టానుసారంగా ప్రేరేపించారని విమర్శించారు. హెగ్‌సేథ్‌పై పదవీవిరమణ చేయబోతున్న రిపబ్లికన్‌ సభ్యుడు థామస్‌ మస్సీ జనవరిలోనే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లో డెమొక్రాట్‌ ప్రతినిధి యాసమిన్‌ అన్సారీ నేతృత్వంలో ప్రతినిధిసభలో మరో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీటిపై వచ్చే వారం ఓటింగ్‌ జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు రిపబ్లికన్‌ సభ్యులు సైతం ఈ తీర్మానాలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ప్రతినిధిసభలో డెమొక్రాట్లకు 254, రిపబ్లికన్లకు 162 స్థానాలు ఉన్నాయి. మరో 19 స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. లూసియానాలో రన్‌ ఆఫ్‌ ఎన్నిక జరగాల్సి ఉంది.

ప్రతినిధిసభలో తీర్మానం ఆమోదం పొందినప్పటికీ హెగ్‌సేథ్‌ను పదవి నుంచి తొలగించాలంటే సెనెట్‌లో మూడింట రెండు వంతుల మంది...అంటే 67 మంది సభ్యులు మద్దతు తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్