Magazines

ప్రభుత్వాన్ని 
ఏర్పాటు చేయండి

13 నిమిషాల క్రితం

Form the government
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

ఐసెన్‌కోట్‌కు ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు హెర్జోగ్‌ ఆహ్వానం

టెల్‌ అవీవ్‌ : ఇజ్రాయిల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా యాషర్‌ పార్టీ నాయకుడు గాడీ ఐసెన్‌కోట్‌ను దేశాధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఆహ్వానించారు. ప్రస్తుత ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కంటే ఐసెన్‌కోట్‌కే ఎక్కువ మంది పార్లమెంట్‌ సభ్యుల మద్దతు లభించింది. ఐసెన్‌కోట్‌కు 67 మంది, నెతన్యాహూకు 46 మంది ఎంపీల మద్దతు ఉంది. అరబ్‌ పార్టీలు ఐసెన్‌కోట్‌ను ప్రధాని అభ్యర్థిగా సిఫార్సు చేసినప్పటికీ వారితో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు 28 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ అవసరమైతే ఆ గడువును మరో 14 రోజులు పొడిగించవచ్చు. నెతన్యాహూను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యమే ప్రతిపక్షాలను ఏకం చేసినప్పటికీ అభిప్రాయబేధాలు కలిగిన ఆ పార్టీలను కలుపుకుంటూ ఐసెన్‌కోట్‌ 61 మంది సభ్యుల మద్దతును ఎలా కూడగడతారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్