Magazines

జీ హుజూర్‌

23 నిమిషాల క్రితం

Yes, sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 2 నిమిషాల చదవడం

నెలకు రూ. 70 లక్షల ఫీజు

ప్రధానిని అభినందిస్తూ

ట్రంప్‌ పోస్ట్‌ పెట్టింది ఈ సంస్థే

న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా లాబీయింగ్‌ సంస్థ మెర్క్యురీ పబ్లిక్‌ అఫైర్స్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వివాదాస్పదమైంది. ఈ సంస్థలో పనిచేసే కీలక వ్యక్తులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధాలు ఉన్నాయి. వివిధ అంశాలకు సంబంధించి భారత ప్రయోజనాల కోసం అమెరికాలో లాబీయింగ్‌ చేయడానికి ఈ సంస్థకు నెలకు 75,000 డాలర్ల (సుమారు రూ.70 లక్షలు) ఫీజు చెల్లించడానికి మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్‌-మోడీల సోషల్‌ మీడియా పోస్టులకు, ఈ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి ముడి పెడుతూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మోడీని అభినందిస్తూ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పెట్టిన పోస్టును కూడా ఈ సంస్థే నిర్వహించింది. అమెరికా విదేశీ ఏజెంట్ల రిజిస్ట్రేషన్‌ చట్టం (ఫరా) కింద దాఖలు చేసిన డిస్‌క్లోజర్స్‌ ఈ విషయాలను వెల్లడించాయి. అయితే ఈ వార్తలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. వార్తా కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపింది. అమెరికాలో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు లాబీయింగ్‌ సంస్థలను నియమించుకోవడం 1948 నుంచి వస్తున్న సాధారణ పద్ధతేనని వివరించింది. ఈ సమాచారం యావత్తూ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం గతంలో ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్ట్‌నర్స్‌, మిల్లర్‌ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సంస్థలు భారత ప్రభుత్వ ప్రతినిధులు, వైట్‌హౌస్‌ ఉన్నతాధికారుల మధ్య ఫోన్‌ సంభాషణలకు సాయపడ్డాయి.

ఇదిలావుండగా ట్రంప్‌ ఆంతరంగికులైన వ్యక్తుల నేతృత్వంలోని లాబీయింగ్‌ సంస్థలతో భారత రాయబార కార్యాలయం రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నదని 'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' పత్రిక వెల్లడించింది. భారత రాయబార కార్యాలయంలో తాను కుదుర్చుకున్న ఒప్పందంలో...మోడీని అభినందిస్తూ ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పెట్టిన పోస్టు భాగమేనని మెర్క్యురీ పబ్లిక్‌ అఫైర్స్‌ సంస్థ తన డిస్‌క్లోజర్‌లో తెలియజేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్