Magazines

కొత్త పాస్‌పోర్ట్‌ ఇవ్వండి...బంగ్లాకు తిరిగి వస్తా : హసీనా

27 నిమిషాల క్రితం

Give me a new passport... I will return to Bangladesh: Hasina
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం



న్యూఢిల్లీ : కొత్త పాస్‌పోర్ట్‌, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేస్తే స్వదేశానికి తిరిగి వెళతానని పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తెలిపారు. విద్యార్థి ఉద్యమంతో ప్రభుత్వం పతనం కావడంతో 79 సంవత్సరాల హసీనా గత సంవత్సరం ఆగస్టులో బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పలు పర్యాయాలు భారత్‌ను కోరింది. తాజాగా హసీనా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయానికి ఈ-మెయిల్‌ ద్వారా ఓ లేఖను పంపారు. తనకు నూతన పాస్ట్‌పోర్ట్‌, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో ఆమె తాత్కాలిక హై కమిషనర్‌ను కోరారు.

ఆమెకు ఆ ఆలోచనే లేదు : బంగ్లాదేశ్‌

హసీనాకు స్వదేశానికి తిరిగి వచ్చే ఆలోచన లేదని, హసీనా చర్యలు కేవలం ఆమె 'రాజకీయ నాటకీయ వైఖరి'కి అద్దం పడుతున్నాయని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆరోపించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలుగా నూతన పాస్‌పోర్ట్‌, గుర్తింపు కార్డు కోసం హసీనా అభ్యర్థించారంటూ వచ్చిన వార్తలపై ప్రధాన ప్రాసిక్యూటర్‌ మహమ్మద్‌ అమీనుల్‌ ఇస్లామ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్