మధ్యంతర బ్యాలెట్లో నేను ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి
సీబీయస్ న్యూస్ ఇంటర్వ్యూలో అంగీకరించిన ట్రంప్
భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా
శత్రువులను ఎన్నటికీ క్షమించను
ఏఐ సమస్యలను ఎదుర్కోగలం
క్రిప్టో సంస్థ గురించి నాకేం తెలుసు ?
వాషింగ్టన్ : వలసదారులపై తీసుకున్న చర్యలు 'హద్దులు' దాటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. వలసలపై ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు ప్రజాదరణ పొందలేదని చెప్పారు. 'ఇమ్మిగ్రేషన్ అణచివేత చర్యలు కఠినంగా ఉన్నాయి. అవి మరీ కఠినంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను' అని తెలిపారు. తీవ్రమైన నేరాలేవీ చేయకుండా దేశంలో పది సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలంగా నివసిస్తున్న వలసదారులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అలాంటి వారి కోసం డెమొక్రాట్లతో రాజీ ఒప్పందాన్ని కుదుర్చు కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే తీవ్ర నేరాలు చేసిన వారిని, మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉన్న వారిని మాత్రం దేశం నుంచి వెళ్లగొడతామని స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఘోర పరాజయానికి దారితీసిన కారణాలపై ఆదివారం సాయంత్రం ప్రసారమైన సీబీయస్ న్యూస్ '60 మినిట్స్' ఇంటర్వ్యూలో ట్రంప్ లోతుగా విశ్లేషణ చేశారు. అయితే రిపబ్లికన్ల పరాజయాలకు ఆయన ఎలాంటి బాధ్యత తీసుకోకపోవడం గమనార్హం. 'ఎన్నికల బ్యాలెట్లో నేను లేను. గుర్తుంది కదా' అని వ్యాఖ్యానించారు. ఒకవేళ తానే బ్యాలెట్లో ఉండి ఉంటే ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండేవని అన్నారు. రిపబ్లికన్ అభ్యర్థులు తమకున్న ప్రజాదరణను సరిగా ఉపయోగించుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు. ఓటర్లు యుద్ధ వాతావరణాన్ని, పెరిగిన గ్యాస్ ధరలను ఇష్టపడలేదని చెప్పారు. తన మద్దతుదారులు తమ ఓట్లను రిపబ్లికన్ అభ్యర్థులకు బదిలీ చేయలేకపోయారని వాపోయారు.
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం జరిగేది
అంతర్జాతీయంగా శాంతి స్థాపనలో తన పాత్రను ట్రంప్ గట్టిగా సమర్ధించుకున్నారు. తన హయాంలో దాదాపు ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని గొప్పలు చెప్పారు. భారత్-పాకిస్తాన్ వివాదాన్ని ప్రస్తావిస్తూ 'నేను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరిగి ఉండేది. వారు యుద్ధానికి సిద్ధ పడ్డారు. కానీ నేను దాన్ని ఆపగలిగాను. మీరు మూడు నుంచి ఐదు కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడారంటూ పాకిస్తాన్ ప్రధాని అప్పట్లో నాకు చెప్పారు' అని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఇజ్రాయిల్ పట్ల ఒక రకమైన వ్యతిరేకత కన్పి స్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఎన్న టికీ అణ్వాయుధాన్ని సాధించలేదని, అందుకు తాము ఆ దేశాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. శత్రువులుగా భావించే వారిని క్షమిస్తారా అని సీబీయస్ ప్రతినిధి రాస్ డౌదట్ ప్రశ్నించగా 'వారు చాలా చెడ్డవారు. నాకు నచ్చరు. ద్వేషం అనే పదాన్ని వాడవచ్చు. నిజంగానే నా శత్రువుల్లో కొంద రిని ద్వేషిస్తున్నాను. ఇక ముందు కూడా ద్వేషి స్తాను' అని ట్రంప్ చెప్పారు. శత్రువులను క్షమించే కంటే నరకానికి పోవడం మేలని వ్యాఖ్యానించారు.
ఏఐలో చైనాతో పోటీ పడేందుకు సిద్ధంగా లేను
కృత్రిమ మేధతో ఎదురయ్యే సమస్యలను అమెరికా ఎదుర్కోగలదని, చైనాతో పోటీ పడడానికి తాను సిద్ధంగా లేనని ట్రంప్ చెప్పారు. ఏఐకి నిబంధనలు విధించడానికి తనకు అభ్యంతరాలేమీ లేవని అంటూ అయితే అమెరికా కంటే కేవలం ఒక సంవత్సరం మాత్రమే వెనుకబడి ఉన్న చైనాకు ఎలాంటి నిబంధనలు లేవని గుర్తు చేశారు. కాబట్టి ఈ విషయంలో అమెరికా వెనుకబడకూడదని అన్నారు. ఈ సాంకేతికత కారణంగా మానవాళి అంతరించి పోయే ప్రమాదం పది శాతం వరకూ ఉంటుందని ఏఐ కంపెనీల అధినేతలే హెచ్చరిస్తున్నారు కదా అని ప్రశ్నించగా ఆ ప్రమాదాన్ని న్యాయ శాఖ ద్వారా నియంత్రించవచ్చునని చెప్పారు. ఒక ఏఐ సంస్థకు చెందిన వ్యక్తి తప్పుడు పనులు చేస్తున్నాడని సమాచారం రావడంతో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం అతన్ని గట్టిగా హెచ్చరించిందని తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును ఆయన బయటపెట్టలేదు.
సమర్ధవంతమైన పాలన కోసమే తొలగించా
తన పాలనలో ఉన్నతాధికారులు, సిబ్బందిని పెద్ద సంఖ్యలో తొలగించడంపై వస్తున్న విమర్శలకు ట్రంప్ సమాధానమిస్తూ అసమర్థులు, ప్రభుత్వ లక్ష్యాలకు అడ్డుపడే వారిని విధుల్లో కొనసాగించాల్సిన అవసరం లేదని అన్నారు. సమర్ధవంతమైన పాలన కోసమే అలా చేయాల్సి వచ్చిందని సమర్ధించుకున్నారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన పూర్తి రహస్యాలు తన వద్ద ఉన్నాయని సూచనప్రాయంగా చెప్పారు. అయితే పూర్తి వివరాలు ఇవ్వకుండా దాటవేశారు. మీ తర్వాత మాగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే రాజకీయ వారసులు ఎవరని ప్రశ్నించగా పార్టీలో తదుపరి నాయకత్వం బలపడుతుందన్న విశ్వాసాన్ని ట్రంప్ వ్యక్తపరిచారు.
అబ్బే... నాకే తెలీదు
తన కుటుంబానికి చెందిన క్రిప్టో కరెన్సీ సంస్థ 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' గురించి తనకేమీ తెలియదని ట్రంప్ అన్నారు. విదేశీయులు మీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా ప్రతి అధ్యక్షుడికీ ఇలాంటి సమస్యలు తప్పవని చెప్పారు. తన కుమారులతో కలిసి నడిపే కంపెనీల ఆర్థిక లావాదేవీలు కంప్యూ టర్ ఆధారంగా జరుగుతాయని, వాటి గురించి తనకు ఏమీ తెలియదని చెప్పు కొచ్చారు. అధ్యక్షుడిని కాకముందే రియల్ ఎస్టేట్‌లో చాలా డబ్బు సంపాదిం చానని, ఇప్పుడు ఆ కంపెనీలను తన కుమారులు చూసుకుంటున్నారని తెలిపారు. కంపెనీల నుంచి తప్పుకోవచ్చు కదా అని అడగ్గా తన కంపెనీలు సుమారు యాభై వేల స్టాక్స్‌లో ట్రేడింగ్ చేస్తుంటాయని, అవన్నీ కంప్యూటర్ ఆధారంగానే జరిగి పోతుం టాయని, వాళ్లు ఏం కొంటున్నారో, ఏం అమ్ముతున్నారో తనకు అసలే తెలియదని సమాధానమిచ్చారు.






కామెంట్లు (0)