హౌతీల డిమాండ్... అలాంటిదేమీ లేదన్న సౌదీ
సనా : సౌదీ అరేబియాపై దాడులు నిలిపి వేయాలంటే 51 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.3 లక్షల కోట్లు) యుద్ధ పరిహారం చెల్లించా లని, యెమెన్ దేశానికి తమనే అధికారిక, చట్టబద్ధ పాలకులుగా గుర్తించా లని హౌతీలు సౌదీ అరేబియా ను డిమాండ్ చేశారు. సౌదీ అరేబియా నేతృత్వంలో తమపై జరిగిన వైమానిక దాడులు, ఆర్థిక దిగ్బం ధనం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లిం చాల్సిందేని వారు స్పష్టం చేశారు. కాగా హౌతీల డిమాండ్లపై సౌదీ అరేబియా ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. హౌతీలు నష్టపరిహారం కోరినట్లు వచ్చిన వార్తలను సౌదీ దౌత్య విభాగం తోసిపుచ్చింది. ఇవన్నీ కల్పిత వార్తలని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది.






కామెంట్‌లు (0)