తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చిన డిస్ట్రిక్ట్ జడ్జి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట వాషింగ్టన్‌లో ‘విజయ తోరణం’ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తాన్యా చుట్కాన్ బ్రేక్ వేశారు. విజయ తోరణం నిర్మాణానికి జాతీయ రాజధాని ప్రణాళికా సంఘం (ఎన్‌సీపీసీ) గురువారం 8-4 ఓట్లతో అనుమతి ఇచ్చింది. అయితే నిర్మాణ పనులకు 14 రోజుల విరామం ఇవ్వాలంటూ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తోరణం అమెరికా చరిత్ర కు, మాజీ సైనికులకు నివాళి అవుతుందని ఎన్‌సీపీసీలో ట్రంప్ నియ మించిన సభ్యులు వాదించారు. అయితే వేలాది మంది అమెరికా సైనికు లు, సేవల సిబ్బంది సమాధులు ఉన్న అర్లింగ్టన్ జాతీయ స్మశాన వాటికను వీక్షించేం దుకు ఈ తోరణం అడ్డుగా ఉంటుందని వ్యతిరేకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ‘ఆర్క్ డీ ట్రంప్’ పేరుతో ఓ ప్రసిద్ధ తోరణం ఉంది. దీన్ని పోలిఉండే ‘ఆర్క్ డీ ట్రంప్’ను వాషింగ్టన్ నగరంలో తనదైన శైలిలో నిర్మించేందుకు ట్రంప్ ప్రయత్నిం చారు. అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీన్ని నిర్మించాలని భావించారు. దీనిపై సుమారు తొమ్మిది గంటల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం గురువారం సాయం త్రం ఆమోదం లభించింది. అయితే తోరణం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానాల్లో ఇప్పటికే అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రాజెక్ట్ డిజైన్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. దీని ప్రకారం తోరణం పైభాగంలో బంగారు రెక్కల లేడీ లిబర్టీ విగ్రహం, దానికి ఇరు వైపులా రెండు బంగారు గద్దలు ఉంటాయి. ఈ కట్టడానికి రెండువైపులా ‘దేవుని ఆధ్వర్యంలో నడిచే దేశం’,‘అందరికీ స్వేచ్ఛ, సమా నత్వం’ అనే మాటలను బంగారంతో చెక్కుతారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి తోరణం లేదని ట్రంప్ గతంలో తన ట్రూత్ సోషల్‌లో రాశారు.






కామెంట్‌లు (0)