Magazines

లాటిన్ అమెరికా పర్యటనకు పోప్ లియో

32 నిమిషాల క్రితం

Pope Leo
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

రోమ్ : ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న మూడు వారాల అనంతరం పోప్ లియో లాటిన్ అమెరికా పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గతంలో తాను పూజారిగా పనిచేసిన పెరూకు వెళతారు. పోప్ ఆరోగ్య పరిస్థితిని గురించి ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకో వడం లేదని వాటికన్ తెలిపింది. ఆయనను ‘శాశ్వత అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి’గా కాకుండా శస్త్రచికిత్స చేయించుకున్న 71 ఏండ్ల వ్యక్తిగా మాత్రమే పరిగణించాలని చెప్పింది. పెరూతో పాటు పోప్ లియో ఉరుగ్వే, అర్జెంటీనా దేశాల్లో కూడా పర్యటిస్తారు. అయితే పన్నెండు రోజుల సుదీర్ఘ పర్యటన ఎవరికైనా శ్రమతో కూడినదే. ఇందులో అనేక సుదూర, స్థానిక విమాన ప్రయా ణాలు ఉన్నాయి. ఈ పర్యటన అమెజాన్ నుంచి ఆండీస్ పర్వతాల వరకూ వేలాది మైళ్ల దూరం సాగుతుంది. తొలుత ఉరుగ్వేలో పర్యటించే పోప్ లియో ఆ తర్వాత అర్జెంటీనా వెళతారు. పోప్ పర్యటనలోని ముఖ్యమైన ఘట్టాలను భక్తులు దూరం నుంచి వీక్షించేందుకు వీలుగా రోమ్ చర్చి లోపల ఓ పెద్ద తెరను ఏర్పాటు చేశారు. పోప్ తన పర్యటనలో దేశాధినేతలతో సమావేశమవుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో అత్యంత ముఖ్యమైన ఘట్టం నిస్సందే హంగా పెరూయే అవుతుంది. ఎందుకంటే ఆ దేశంలో ఆయన మూలాలున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్