వరంగల్ – రాయపర్తి
శీతల పానీయంలో( పల్పి ఆరెంజ్) పురుగు అవశేషాలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి సంతోష్ గౌడ్ మహబూబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో పల్పి ఆరెంజ్ (మినిట్ మేడ్) 200 ఎంఎల్ కూల్ డ్రింక్ తీసుకున్నాడు. కూల్ డ్రింక్ త్రాగే సమయంలో బాటిల్లో నల్లటి రంగులో పురుగు వంటి అవశేషాలు ఉన్నట్లు గమనించాడు. ఇదేంటని షాపు యజమానిని అడగగా మాకేం తెలుసు అంటూ దాటే సమాధానాలు చెప్పినట్లు సంతోష్ తెలిపారు. ప్రతిరోజు చిన్న వయసు పిల్లలు నుండి మొదలు పెద్దల వరకు పాల్పి ఆరెంజ్ కూల్ డ్రింక్స్ తాగుతుంటారని వారు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి పల్పి ఆరెంజ్ కూల్ డ్రింక్ కంపెనీ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
శీతల పానీయంలో పురుగు అవశేషాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



