రెండు కార్లు.. ఆటో ధ్వంసం…
పలువురికి గాయాలు ..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి: తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు, ఒక ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన ఓ కుటుంబం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దైవ దర్శనం చేసుకుని మారుతి షిఫ్ట్ కార్లో తిరుగు ప్రయాణమయ్యారు. సారంపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే ఎదురెదురుగా ఆలేరు నుండి వేములవాడలో పెళ్లి పత్రికలు పంపిణీ చేసేందుకు వస్తున్నవారు ఆటోలో వస్తుండగా కారు ఆటోను ఢీకొంది. దీంతో ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టి బోల్తా పడింది. కారు అదుపుతప్పి ఆటో వెనకాల సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ డాక్టర్ కార్ ఇన్నోవా హైదరాబాదు నుండి సిరిసిల్లకు వస్తుండగా మారుతి షిఫ్ట్ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఆటో ధ్వంసం అయ్యాయి. కారులో ఉన్న డ్రైవర్ గుంటుపల్లి సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న తుపాకుల శ్రీలత, కార్తీకులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని 108 సహాయం ద్వారా సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి ట్రెయినీ ఎస్సై వినీత రెడ్డి చేరుకొని పరిశీలించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ధ్వంసమైన కార్లను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.
సారంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES