నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొండ లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు గొట్టిపాముల బాబురావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక జ్యోతిబాపూలే విగ్రహం వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మహనీయ నాయకుడు అని కొనియాడారు. చిన్ననాటి నుంచే సామాజిక న్యాయం,సమానత్వం, రైతుల సమస్యలపై ఆసక్తి కనబరిచారు.స్వాతంత్ర్యోద్యమంలో సైతం పాల్గొని జైలు శిక్షను అనుభవించారన్నారు.
రాజకీయ జీవితంస్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారన్నారు.తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం గళమెత్తి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.1952లో జరిగిన ముల్కీ అగిటేషన్ (ఉద్యోగాలపై స్థానికుల హక్కుల కోసం పోరాటం)లో ప్రముఖ పాత్ర పోషించారన్నారు.1969లో జరిగిన మొదటి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మంత్రిత్వాన్ని వదిలి తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న మొదటి మంత్రి అయ్యారన్నారు.అనంతరం వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నా, ఆయన ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించడమే. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సమస్యలపై ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారన్నారు. పేదల విద్య కోసం పనిచేశారన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి చేశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడారు. ఈ కార్యక్రమంలో మాటూరి అశోక్, చిన్నం కి ష్టయ్య, మిర్యాల శ్రీనివాస్, కొత్త బాలరాజు, మెరుగు మదన్మోహన్, గడిల ప్రభాకర్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరిని కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES