Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విజ్ఞాన యాత్రకు యాదాద్రి రైతులు

విజ్ఞాన యాత్రకు యాదాద్రి రైతులు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులనుఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విజ్ఞాన యాత్రకు వెళ్లినట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి మాధవి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో విజ్ఞాన యాత్ర బస్సును ప్రారంభించి, ఆమె మాట్లాడారు. ఉద్యాన, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టీజీ ఆయిల్ ఫేడ్ కంపెనీ సహకారంతో జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు  60 మంది రైతులను  విజ్ఞాన యాత్రకు పంపించినట్లు తెలిపారు. విజ్ఞాన యాత్రలో ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించి, పంటపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో  ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, టీజీ ఆయిల్ఫేడ్ ఫీల్డ్ ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -