Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శిగా ఏర్పుల యాదయ్య

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శిగా ఏర్పుల యాదయ్య

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శిగా మండలంలోని ఇందూర్తి గ్రామానికి చెందిన ఏర్పుల యాదయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. జిల్లా కేంద్రంలో ఈ నెల 14,15 తేదీలలో జరిగిన సీఐటీయూ 13వ జిల్లా మహాసభలో ఆయనను రెండోసారి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వర్గంలో నాయకుడిగా తన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తూ, కార్మికులను సంఘటితం చేసి,కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానని తెలిపారు. తన మీద నమ్మకంతో రెండవసారి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకొనుటకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, కార్మిక వర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -