Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యాదవులు రాజకీయంగా అభివృద్ధి చెందాలి

యాదవులు రాజకీయంగా అభివృద్ధి చెందాలి

- Advertisement -

టీపీసీసీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ వీరన్న యాదవ్
నవతెలంగాణ – పెద్దవంగర

యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని టీపీసీసీ ఓబీసీ విభాగం వర్కింగ్ చైర్మన్ మేకల వీరన్న యాదవ్, జిల్లా నాయకుడు చెవిటి సధాకర్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో యాదవ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం సెప్టెంబర్ 5న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే గొల్ల, కురుమ సదస్సు పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్ర జనాభాలో అత్యధికులైన యాదవులు, కురుమ సామాజిక వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాండవుల పక్షాన ధర్మం, న్యాయం ఉండటం వల్లనే శ్రీకృష్ణుడు పాండవుల వైపున నిలబడ్డారని, యాదవులు కూడ శ్రీకృష్ణుని మార్గంలో పయనించి దేశం, సమాజం కోసం, ధర్మం కోసం నిలబడుతున్నారని గుర్తు చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉండటం హర్షించదగ్గ విషయం అన్నారు. గొల్ల, కురుమ, యాదవుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు. పేద యాదవులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. సెప్టెంబర్ 5న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్ లో జరిగే గొల్ల కురుమ సదస్సు ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి ఎమ్మెల్యేలు మురళి నాయక్, జాటోతు రాంచంద్రు నాయక్, మామిడాల యశస్విని రెడ్డిలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సూత్రపు రాజు, మేకల శివ, రాసాల సమ్మయ్య, బొమ్మరబోయిన రాజు, గంగాధర్, వెంకటనారాయణ, ప్రవీణ్, రమేష్, సుభాష్, కుమారస్వామి, మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad