Friday, January 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనిన్న వెనిజులా.. నేడు గ్రీన్‌లాండ్‌

నిన్న వెనిజులా.. నేడు గ్రీన్‌లాండ్‌

- Advertisement -

– స్వాధీన పరిశీలనలో సైనిక ఆప్షన్‌ : వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌
శ్వేతసౌధం :
చమురుపై పెత్తనం కోసం వెనిజులాను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు మరువకముందే గ్రీన్‌లాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రీన్‌లాండ్‌ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం పునరుద్ఘాటించింది. దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిల్లో సైన్యాన్ని ఉపయోగించే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్‌ వ్యూహాత్మకంగా కీలకమైందని, ఆర్కిటిక్‌ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమని అధ్యక్షుడు భావిస్తున్నారన్నారు. ఆ లక్ష్యం దిశగా ముందుకువెళ్లడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని తన బృందానికి సూచించారని చెప్పారు. వెనిజులా నేత నికోలస్‌ మదురోను సైనిక ఆపరేషన్‌ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి గ్రీన్‌లాండ్‌ పేరు వార్తల్లో వినిపిస్తోంది. ఇంకో 20 రోజుల్లో మాట్లాడదా మంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్‌ ‘త్వరలో ‘ అనే పోస్టు పెట్టడం కలకలం రేపుతోంది. దీంతో ఈ ద్వీపాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యూహాత్మక, ఖనిజాలతో నిండి ఉన్న ఈ ఆర్కిటిక్‌ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -