Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యోగాసనాలు 

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యోగాసనాలు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక బర్కత్పురా నందుగల రోటరీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సభ్యులందరూ కలిసి ప్రముఖ ట్రైనర్ రోటరీ సీనియర్ మెంబర్ గోపాల్ సోని ఆధ్వర్యంలో యోగాసనాలను చేశారు. తదనంతరం ఫిజియోథెరపీ కన్సల్టెంట్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్ అను అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్చార్జి అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ డాక్టర్ సలోని అఖిల్ షా హాజరై రోజువారి దినచర్యలో ప్రతినిత్యం ఏదో ఒక రకంగా మనకు ఏర్పడే నొప్పుల నివారణకై సంబంధించిన కొన్ని ఆరోగ్య ఎక్సర్సైజ్ చిట్కాలను వివరించడం జరిగినది. కార్యక్రమంలో కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యనిర్హణాధికారి సతీష్ షహ, తదితర సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad