Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి ముసుగులో దోచుకున్నది మీరు..

అభివృద్ధి ముసుగులో దోచుకున్నది మీరు..

- Advertisement -

ప్రజల ఆర్థిక అభివృద్ధే నా లక్ష్యం 
నవతెలంగాణ – పరకాల

అభివృద్ధి ముసుగులో దోచుక తిన్నది మీరు నియోజకవర్గ ప్రజల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారంటూ చేసిన ఆరోపణల సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. కొంతమంది రాష్ట్రంలో అప్పుడప్పుడు ఏర్పడే అనిచ్చిత పరిస్థితులకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని బిఆర్ఎస్, బిజెపి పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు.

వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని బిజెపి,బిఆర్ఎస్ పార్టీలే కారణమన్నారు. ఈ సీజన్లో ఇప్పటికే అందాల్సిన దానికన్నా అధికంగా యూరియా అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎప్పటికే 14,50 ఎలక్ట్రిక్ టన్నుల యూరియా దిగుమతి జరిగిందన్నారు. మరో 15 రోజుల్లో 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి కానున్నట్లు వెల్లడించారు. వాస్తవ వాస్తవాలు పరిశీలించకుండా చల్ల ధర్మారెడ్డి చేస్తున్న అప్పుడు ప్రచారాన్ని  ప్రజలు నమ్మకూడదన్నారు.

పరకాల అభివృద్ధిపై తనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నానని ధర్మారెడ్డి చేస్తున్న ఆరోపణలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో సింగపూర్, శ్రీలంకలో గడిపిన ధర్మారెడ్డి తనకు పరకాల అభివృద్ధిపై అవగాహన లెదనడం ఎంత వరకు సమంజసమో ఆయన విచక్షణకే వదిలేస్తున్నానన్నారు. అయినా రైతుల గురించి మాట్లాడారు అర్హత ధర్మారెడ్డికి గాని బిఆర్ఎస్ నేతలకు కానీ లేదన్నారు. ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన పాపానికి రైతుల చేతులకు సంకెళ్లు వేసిన చరిత్ర మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. గతంలో ఖరీఫ్ వరి పంటలు కనుగొను చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు గాను కల్లాలలోనే రైతుల గుండెలు ఆగిన పరిస్థితిని గుర్తులేదా అంటూ నిలదీశారు. 

పరకాల అభివృద్ధికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే గతంలో 3 వందల 5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఎలాంటి పురోగతి లేకుండా పనులు వదిలేసిన చరిత్ర ఎవరిదో ధర్మారెడ్డి గ్రహించాలన్నారు. ఎన్నికల స్టంట్ దృష్టిలో పెట్టుకొని వారు మొదలు పెట్టిన పనులను కాంట్రాక్టర్లు సైతం మొండికేసీ కూకుంటే వాటన్నింటిని రీ డిజైనింగ్ తో పనులు పూర్తి చేయించిన చరిత్ర నాదేనన్నారు. ధర్మారెడ్డి చెప్పిన ప్రకారం నాకు చేతగానిది ఏదైనా ఉంటే  అభివృద్ధి పనులతో దోసుక తినడం తనకు నిజంగానే చేతకాదంటు సెటైర్లు వేశారు. అవసరం లేకున్నా నిర్మాణాలు చేపట్టి దూసుకు తినడం నాకు చేతకాదన్నారు. నాకు తెలిసింది ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే అన్నారు.

అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 3 వేలకు పైగా ఇందిర మైండ్లు, 800 పైగా  రాజీవ్ గృహ కాలనీ, పాలిటెక్నిక్ కళాశాలకు అనుబంధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, సంగెం,ల్యాదల ప్రాంతాల్లో మహిళల అభివృద్ధి కోసం డైరీ ఫార్మ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇలా ప్రజల కోసం ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే తాను పనిచేస్తున్నానని తనను విమర్శించే నైతిక అర్హత ధర్మారెడ్డికి లేదన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు కొయ్యల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పాడి కల్పన, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -