ప్రజల్లోకి నీతివంత రాజకీయాల్ని తీసుకెళ్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కులం, మతం, భాష, ప్రాంతం పేర్లతో దేశాన్ని విభజించాలనే వారి కుట్రలు ఎప్పటికీ విజయం సాధించలేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు. దేశంలో ఏకత్వాన్ని కాపాడేది తమ పార్టీనే అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభారు పటేల్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సర్దార్ వల్లభారు పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఏక్‌భారత్-ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాన్ని ఈ నెల ఆరో తేదీన లాంఛనంగా ప్రారంభించిందనీ, ఈ నెల 31 వరకు అది కొనసాగుతుందని తెలిపారు. పటేల్ పేరు వింటేనే తెలంగాణ ప్రజల హృదయాలు పులకించిపోతాయన్నారు. ఆయన కృషితోనే తెలంగాణ భారత్‌లో భాగమైందని చెప్పారు. ఇతర పార్టీలు ఆయన్ను మర్చిపోయినా బీజేపీ మాత్రం ఎప్పటికీ స్మరిస్తుందని తెలిపారు.
దేశంలో నీతివంత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడైనా ఆయన దేశ సేవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నారు. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మాటను అమిత్‌షా నిలబెట్టుకున్నారనీ, ఆయన ఈతరం పటేల్ అని కొనియాడారు. తెలంగాణలోని కొంత మంది రాజకీయ నాయకులు మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇటీవలే సరెండర్ అయిన వారు చెప్పటాన్ని సీరియస్‌గా చూడాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి మంచి అవకాశాలన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందనీ, ఇప్పుడు నెపాన్ని ఇతర పార్టీలపై నెట్టాలని చూస్తున్నదని విమర్శించారు.
విభజన కుట్రలతో విజయం సాధించలేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES