Wednesday, January 7, 2026
E-PAPER
Homeక్రైమ్కదులుతున్న రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

కదులుతున్న రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతారం గ్రామానికి చెందిన కేసి మహేష్ అనే యువకుడు సోమవారం కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్ నుండి తాండూరు వైపు వస్తుండగా జరిగింది.

రైలు అతని రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -