- Advertisement -
మరో యువకుడి పరిస్థితి విషమం..
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ కు చెందిన నవీన్ కుమార్ (26) విద్యుత్ షాక్ తో మృతి చెండాడు. నవీన్కుమార్ తన బంధువుల టెంట్ హౌస్ లో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం సిరిపెల్లి తండా 1 గ్రామంలో టెంట్లు వేసే క్రమంలో ఒక్కసారిగా లేవన్ కెవి విద్యుత్ తీగలకు శ్యామ్, నవీన్ అనే యువకులకు యువకులకు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్పందించిన స్థానికులు బైంసా ఏరియా అస్పత్రికి తరలించారు. అక్కడ చికత్స పొందుతూ నవీన్ కుమార్ మృతి చెందారు. దింతో శ్యామ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
- Advertisement -



