నవతెలంగాణ- కంఠేశ్వర్
నరగంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని కంఠేశ్వర్- రైల్వే కమాన్ వద్ద జరిగింది. స్థానిక మూడవ టౌన్ ఎస్ఐ హరీష్ బాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని విక్లీ బజార్ కు చెందిన సంతోష్ (36) బైక్ పై నిజామాబాద్ నగరం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెలుతున్న కార్ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న ప్రయివేట్ స్కూల్ బస్ ను వెనుకనుంచి సంతోష్ ఢీకొట్టాడు. అతడు ప్రయాణిస్తున్న బైక్ ను వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ ను 108 అంబులేన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. సంతోష్ ఉత్తర్ ప్రదేశ్ వాసి కాగా టైల్స్ పనిచేస్తూ.. జీవిస్తున్నట్టు తెలిసింది. మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES