Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఓటర్ లిస్ట్ కోసం జీపీ కార్యాలయానికి వచ్చిన యువకులు

ఓటర్ లిస్ట్ కోసం జీపీ కార్యాలయానికి వచ్చిన యువకులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ ఓటర్ జాబితా గోడపైన ప్రదర్శించడం జరిగింది. తమ ఓటు ఏ వార్డులో ఉందో అని తెలుసుకునేందుకు అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గ్రామానికి చెందిన యువకులు భారీ సంఖ్యలో జిపి కార్యాలయానికి వచ్చి ఓటర్లు జాబితాను, ఓటరు క్రమ సంఖ్యను శనివారం పరిశీలించుకోవడం జరిగింది. అదేవిధంగా జుక్కల్ గ్రామ పంచాయతీ యందు జుక్కల్ గ్రామ యువకులు బారి సంఖ్యలో రావడంతో కార్యాలయ ఆవరణ మొత్తం కిక్కిరిసి పోయింది.  గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు -2025 ఓటర్ల జాబిత ముఖ పత్రాలని యువకులు పరిశీలించడం జరిగింది.

ఓటర్ల వివరాలు,వార్డుల వివరాలను పక్కగా ఉన్నాయా? అని గ్రామ యువకులు చూసుకొని చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా బస్వాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్న గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ రవిశంకర్ పటేల్ జిపి కార్యదర్శి భరద్వాజ్ ను గోడ పై ప్రదర్శించిన జాబితాను తమ ఓటు ఉందా? లేదా ? అని లిస్టులో పరిశీలించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ గల్కట్ వార్ రాజు, గ్రామ యువకులు బొంపల్లి వార్ విజయ్ కుమార్, నిరడి రాజు, మాధవరావు, రామ్ గోండా, ఏంబరి సాయికుమార్, హైమద్, తుకారం,అంజద్ భాయ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad